అభివృద్ధి పనులకు ఎక్కువ నిధులు కేటాయించాలి
డాబాగార్డెన్స్: జీవీఎంసీ అభివృద్ధి పనులకు సంబంధించి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని, అందుకు తగిన విధంగా బడ్జెట్‌ను సవరించాలని స్థాయీ సంఘం సభ్యులు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన అధికారులను కోరారు. జీవీఎంసీ 2025–26 బడ్జెట్‌పై శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మేయర్, స్థాయీ సంఘం చైర్‌పర్సన్ గొలగాని వెంకటకుమారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. స్థాయీ సభ్యులకు బడ్జెట్‌లో పొందుపరచిన అంశాలను అధికారులు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు జీవీఎంసీకి వస్తాయని, జన్మభూమి–2లో భాగంగా నగరంలో ప్రతిపాదించే వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూ బడ్జెట్‌లో పెట్టాలన్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రాలేదని, ఇకపై ఆయా నిధులకు కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని కోరారు. సమావేశంలో స్థాయీ సంఘం సభ్యులతో పాటు అదనపు కమిషనర్ ఎస్‌ఎస్ వర్మ, ప్రధాన ఇంజినీరు శివప్రసాదరాజు, ఎ గ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆదినారాయణ, చార్టర్డ్ అకౌంటెంట్ స త్యనారాయణ పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment