సమన్వయంతో నావికాదళ విన్యాసాలు
ఏయూక్యాంపస్: సాగర తీరంలో జనవరి 4వ తేదీన నిర్వహించనున్న నావికాదళ విన్యాసాల నిర్వహణలో అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. నావికాదళం, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ కమిషనర్లతో కలిసి శనివారం ఆయన క్షేత్రస్థాయి పర్యటించారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్, ఆర్.కె బీచ్ పరిసర ప్రాంతాలలో ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాన వేదిక నిర్మాణం, ఫైర్ వర్క్, లేజర్ షో, డ్రోన్ షో నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు భాగస్వామ్యం కానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా బారికేడింగ్ పూర్తిస్థాయిలో చేయాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టం పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు.
నేవీ, జిల్లా అధికారులతో క్షేత్రస్థాయిలోసమీక్షించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment