పగ
పండుటాకులపై
● అనర్హుల పేరుతో పింఛన్ ఏరివేతకు కూటమి ప్రభుత్వం సిద్ధం ● ఆరు దశలలో సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది ● పెన్షన్ రూ.4 వేలు చేయడంతో భారాన్ని తగ్గించుకునే కుట్ర ● భారీగా లబ్ధిదారుల్లో కోత పెట్టాలని నిర్ణయం ● ఇందిరానగర్‌లో చేపట్టిన సర్వేలో 5 శాతం తొలగింపునకు చర్యలు
మహారాణిపేట: పండుటాకులపై కూటమి ప్రభుత్వం పగబట్టింది. అనర్హుల పేరుతో సామాజిక పింఛన్ల ఏరివేతకు సిద్ధమవుతోంది. పింఛన్ భారాన్ని తగ్గించుకోడానికి భారీ ఎత్తున కోత విధించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆరు దశల (సిక్స్ స్టెప్ సర్వే) పరిశీలన ప్రక్రియను శరవేగంగా చేపడుతోంది. తద్వారా ఏళ్ల తరబడి పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. ఇటీవల ఇందిరానగర్–2లో చేపట్టిన సర్వేలో ఐదు శాతం లబ్ధిదారులను అనర్హులుగా అధికారులు తేల్చారు. దీంతో అన్ని సామాజిక పింఛనుదారుల్లో ఆందోళన నెలకొంది.
కూటమి అధికారంలోకి రాగానే
2014లో అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీల పేరిట... ఉన్న పెన్షన్లకు టీడీపీ ప్రభుత్వం ఎలా కోత విధించిందో.. ఈసారీ సీన్ రిపీట్ చేసింది. ఈ ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి మార్చి నెలలో విశాఖ జిల్లాలో 1,65,891 మంది పింఛనుదారులుండేవారు. కానీ ప్రస్తుతం 1,61,584 మందే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు 4,307 మంది లబ్ధిదారులను తొలగించారు.
నెల నెలా కోత..
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 1,65,891 మంది లబ్ధిదారులు ఉండేవారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత : జూలైలో 1,64,239 మందికి మాత్రమే పింఛను అందజేశారు.
ఆగస్టులో పింఛన్‌దారుల సంఖ్య 1,62,490కి తగ్గిపోయింది.
సెప్టెంబర్‌లో 1.62 లక్షలమందికి కుదించారు.
అక్టోబర్‌లో లబ్ధిదారుల సంఖ్య 1,61,969, నవంబర్, డిసెంబర్‌లో 1,61,584 మంది లబ్ధిదారులను కుదించారు.
Comments
Please login to add a commentAdd a comment