డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన టౌన్‌ప్లానింగ్ ఓపెన్ ఫోరానికి 8 వినతులు అందాయి. కమిషనర్ సంపత్‌కుమార్ ఫోరంలో చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, సీపీలు, డీసీపీలు, ఏసీపీలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహించే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానివేనని, ఈ నేపథ్యంలో ఇక నుంచి ప్రతి శుక్రవారం టౌన్‌ప్లానింగ్ ఓపెన్ ఫోరం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిలో జోన్–2 నుంచి 2, జోన్–3 నుంచి 2, జోన్–4 నుంచి ఒకటి, జోన్–5 నుంచి 2, జోన్–8 నుంచి ఒక వినతి వచ్చిందన్నారు. అందిన ఫిర్యాదులపై అధికారులు స్పందించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment