స్టీల్‌ప్లాంట్ అగ్నిమాపక కేంద్రం ప్రైవేటీకరణ
ఉక్కునగరం: కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా.. ప్లాంట్‌కు చెందిన ఒక యూనిట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. స్టీల్‌ప్లాంట్‌కు చెందిన అగ్నిమాపక కేంద్రం నడిపే బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు మొదటి అడుగు పడింది. ఇందుకు సంబంధించి ఉక్కు యాజమాన్యం ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ)కు దరఖాస్తులు ఆహ్వానించింది. స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఆర్‌ఎంహెచ్‌పీ, కోక్ ఓవెన్స్, సింటర్ ప్లాంట్, బ్లాస్ట్‌ఫర్నేస్, స్టీల్ మెల్ట్ షాప్, రోలింగ్ మిల్స్, సీఆర్‌ఎంపీ, ఎయిర్ సెపరేషన్ ప్లాంట్, ఎల్‌పీజీ స్టోరేజ్ ట్యాంక్‌లు, థర్మల్ పవర్ ప్లాంట్, వాటర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ఎనర్జీమెనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, గ్యాస్ హోల్డర్లు, స్టీల్‌ప్లాంట్‌లోని ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ తదితర కీలకమైన విభాగాల్లో అగ్నిమాపక సేవలు అందించడానికి ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని కోరింది. అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, హాస్పిటాలిటీ సర్వీసెస్, హిల్‌టాప్ గెస్ట్‌హౌస్, ఎల్ అండ్ డీసీ, టౌన్‌షిప్, పాఠశాలలు, బ్యాంకులు, పోస్టాఫీస్, పబ్లిక్ బిల్డింగ్‌లలో జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని అందులో పేర్కొంది. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రంలోని ఫైర్ టెండర్లు, యంత్రాల వివరాలు పొందుపరిచారు. అతి ఉష్ణోగ్రతల్లో 24 గంటలు సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. పూర్తి వివరాలతో సంప్రదించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment