మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం : మహా కుంభమేళాకు విచ్చేసే భక్తులు, తీర్థయాత్రికుల కోసం ఈస్ట్‌కోస్ట్ రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు.
● విశాఖపట్నం–గోరఖ్‌పూర్ (08562) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 5, 19, ఫిబ్రవరి 16వ తేదీల్లో (ఆదివారం) రాత్రి 10.20 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మంగళవారం రాత్రి 8.25 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గోరఖ్‌పూర్–విశాఖపట్నం(08561) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 8, 22, ఫిబ్రవరి 19వ తేదీల్లో (బుధవారం) మధ్యాహ్నం 2.20 గంటలకు గోరఖ్‌పూర్‌లో బయల్దేరి శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు 4–థర్డ్ ఏసీ, 2–థర్డ్ ఏసీ ఎకానమి, 8–స్లీపర్ క్లాస్, 4–జనరల్ సెకండ్ సిటింగ్, 1–సెకండ్ క్లాస్ కం లగేజి /దివ్యాంగ, 1–జనరేటర్ మోటార్ కార్ కోచ్‌లతో నడుస్తాయి.
● విశాఖపట్నం–దీన్ దయాల్ ఉపాధ్యాయ (08530) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 9, 16, 23, ఫిబ్రవరి 6, 20, 27వ తేదీల్లో (గురువారం) సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి శనివారం తెల్లవారు 4.30 గంటలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ–విశాఖపట్నం(08529) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 11, 18, 25, ఫిబ్రవరి 8, 22, మార్చి 1వ తేదీల్లో శనివారం రాత్రి 8.10 గంటలకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయలో బయల్దేరి సోమవారం తెల్లవారు 3.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు 4–థర్డ్ ఏసీ, 2–థర్డ్ ఏసీ ఎకానమి, 8–స్లీపర్ క్లాస్, 4–జనరల్ సెకండ్ సిటింగ్, 1–సెకండ్ క్లాస్ కం లగేజి /దివ్యాంగ, 1–జనరేటర్ మోటార్ కార్ కోచ్‌లతో నడుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment