సంపత్ వినాయగర్ హుండీ ఆదాయం రూ.23.76 లక్షలు
సీతమ్మధార: ఆశీలమెట్టలోని సంపత్ వినాయగర్ దేవస్థానం హుండీలను మంగళవారం లెక్కించారు. దేవదాయ శాఖ తనిఖీదారులు, విజయనగరం జిల్లా అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈవో కె.శిరీష ఆధ్వర్యంలో దేవస్థానం ఆవరణలో హుండీ లెక్కింపు చేపట్టారు. 38 రోజులకు గానూ రూ.23.76లక్షల నగదు, 21 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 0.107 కిలోల వెండి, 96 యూఎస్ డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 200 యుఏఈ దిర్హామ్, 111 చెక్కులు లభించినట్లు ఈవో తెలిపారు. శివజ్యోతి సేవా సంఘం సభ్యులు, దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment