భూముల అన్యాక్రాంతానికి ప్రయత్నం
సదరు ఇంజనీరింగ్ అధికారి గతంలో కూడా యూనివర్సిటీకి సంబంధించిన విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. హనుమంతవాక జాతీయ రహదారికి ఆనుకొని ఏయూకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఇందులో రెండు ఎకరాలను కబ్జా చేయడానికి కొంత మంది ప్రయత్నించారు. ఆ సమయంలో సదరు అధికారి ఆ భూమిలో కేవలం మూడు ఎకరాలకు మాత్రమే ఫెన్సింగ్ వేసి మిగిలిన రెండు ఎకరాలను కబ్జాదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారన్న వాదనలు ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన అప్పటి వీసీ ప్రసాదరెడ్డి ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని మొత్తం భూమికి ప్రహరీ నిర్మించారు. అంతే కాకుండా మద్దిలపాలెం ప్రాంతంలో పిఠాపురం కాలనీలో కూడా ఏయూ భూముల అన్యాక్రాంతం విషయంలో ఇంజనీరింగ్ అధికారి పాత్ర ఉందన్న టాక్ వినిపించింది. అయితే, ఈ అధికారి వెనుక కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఓ కార్పొరేటర్ పాత్ర కూడా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment