నేటి నుంచి డ్వాక్రా మేళా
ఎంవీపీకాలనీ: ఏఎస్ రాజా మైదానంలో బుధవారం డ్వాక్రా మేళా ప్రారంభంకానుంది. జీవీఎంసీ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న మేళాలో 100 స్టాళ్ల ద్వారా వివిధ రకాల డ్వాక్రా ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు విక్రయిస్తారు. ఈ మేళాలో 20 ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేసిన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరగనున్నాయి. డ్వాక్రా సంఘాల తయారు చేసిన ఉత్పత్తులు, చీరలు, వివిధ రకాల వస్త్రాలు, బొమ్మలు, గృహోపకరణాలు ఈ మేళా ద్వారా విక్రయించనున్నారు. నగర ప్రజలు మేళాను సందర్శించి విజయవంతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ ఓ ప్రకటనలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment