కరెంట్ షాక్
● ఇదేం బాదుడు బాబూ!
ఎఫ్‌పీపీసీసీ పేరిట కూటమి సర్కారు దొంగ దెబ్బ
కూటమి
బిల్లు కంటే అదనపు చార్జీల భారమే ఎక్కువ
ఉమ్మడి విశాఖ ప్రజలపై రూ.293 కోట్లు అదనపు భారం
5 యూనిట్ల
వినియోగానికి
రూ.258 బిల్లు
విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసన
జనం బాధలకు మద్దతుగా నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట
ఆరిలోవకు చెందిన బోస రెడ్డి ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశాడు. కొద్ది నెలలుగా తన బావతో కలిసి ఆరిలోవలో సెల్ షాపు నిర్వహిస్తూ తల్లికి చేదోడుగా ఉంటున్నాడు. ఈ షాపునకు ఈనెల వచ్చిన కరెంట్ బిల్లు రెడ్డికి మరింత భారంగా మారింది. గత నెల కంటే అదనంగా రూ.268 వచ్చింది. నవంబర్ నెలలో 97 యూనిట్లకు రూ.888 బిల్లు రాగా డిసెంబర్‌లో 110 యూనిట్లకు ఏకంగా రూ.1,156 బిల్లు వచ్చింది.
హెచ్‌బీ కాలనీలో ఓ వినియోగదారుడు బిల్లులో విద్యుత్ వినియోగం ఖర్చు రూ.27.72 అయితే ఫిక్స్‌డ్ చార్జీ రూ.30,
కస్టమర్ చార్జీ రూ.25, ఇంధనం సర్దుబాటు చార్జీ–1 రూ.267.36, ఇంధనం సర్దుబాటు చార్జీ–2 రూ.102 కలిపి మొత్తం రూ.447.33 బిల్లు వచ్చింది. అంటే విద్యుత్ వినియోగం బిల్లు 6 శాతం అయితే 94 శాతం అదనపు భారం.
ఈ మూడే కాదు ఏ ఇంటి తలుపు తట్టినా కరెంట్ షాక్ కొడుతోంది. కూటమి ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా.. ప్రజలందరికీ కరెంటు బిల్లుల బోనస్ అందించింది. ట్రూఅప్, సర్దుబాటు చార్జీల పేరుతో జనంపై పెనుభారం మోపింది. సీఎం చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి అంటే ఇదేనేమా మరి.
Comments
Please login to add a commentAdd a comment