వైఎస్సార్‌సీపీ పోరుబాటకు తరలిరండి
పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ పిలుపు
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ చార్జీల బాదుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27న నిర్వహించే ‘వైఎస్సార్ సీపీ పోరుబాట’ విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అనంతరం అంతా గురుద్వార్ వద్ద గల ఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయం వద్ద చేపట్టే నిరసన కార్యక్రమంలో పాల్గొని సీఎండీకు వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, మేయర్, సమన్వయకర్తలు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ముఖ్యనాయకులతో పాటు విద్యుత్ వినియోగదారులు పాల్గొనాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment