న్యూ ఇయర్ ఈవెంట్లకు అనుమతులు తప్పనిసరి
పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి
విశాఖ సిటీ: నూతన సంవత్సర ఈవెంట్లు నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా అనుమతులు పొందాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు కార్యక్రమాలు, ఈవెంట్స్ నిర్వహించాలనుకుంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిర్వాహకులు తమ సంస్థలోని అన్ని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్దే కాకుండా పార్కింగ్ ప్రదేశాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఆ రోజు నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. 31వ తేదీ రాత్రి 8 నుంచి 1వ తేదీ తెల్లవారుజాము 5 వరకు పలు ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు, రాకపోకలపై నిషేధం ఉటుందన్నారు. ప్రధానంగా బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధించనున్నట్లు వెల్లడించారు.
నిర్వాహకులు పాటించాల్సినవి
● నిర్వహణ ప్రదేశంలో ట్రాఫిక్ నిర్వహణ, ప్రవేశం, భద్రత కోసం సెక్యూరిటీ గార్డులను నియమించాలి.
● ఎటువంటి అశ్లీలత/న్యూడిటీ ఉండకూడదు.
● ప్రైవేట్ రిసార్ట్ యాజమాన్యాలు 24/7 ఒక సూపర్‌వైజర్/గార్డును వారి స్విమ్మింగ్ పూల్ వద్ద నియమించాలి. మద్యం మత్తులో ఉన్న వారిని స్విమ్మింగ్ పూల్‌లోకి అనుమతించరాదు.
● శబ్ధ స్థాయిలు 45 డెసిబెల్స్ కంటే తక్కువగా ఉండాలి.
● ఈవెంట్ ప్రదేశంలో ఎలాంటి ఆయుధాలను అనుమతించకూడదు.
● ఈవెంట్లకు సామర్థ్యానికి మించి పాస్‌లు, టికెట్లు, కూపన్లు ఇవ్వరాదు.
● జంటల కోసం నిర్వహించే కార్యక్రమాల్లో, పబ్, బార్లలో మైనర్లను అనుతించరాదు.
● మాదకద్రవ్యాలు, నార్కోటిక్, సైకోట్రోపిక్ పదార్థాల వినియోగం నిషేధం.
● ఎకై ్సజ్ శాఖ అనుమతించిన సమయానికి మించి మద్యం అందించకూడదు.
● మద్యం సేవించి ఉన్న కస్టమర్లు వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరడానికి డ్రైవర్లు/క్యాబ్‌లను అందించే ఏర్పాట్లు చేయాలి.
● మందుగుండు సామగ్రి ఉపయోగించరాదు.
● చైన్ స్నాచర్లు ఉండే అవకాశం ఉన్నందున విలువైన వస్తువులు, బ్యాగులు జాగ్రత్తగా చూసుకోవాలి.
● నోవాటెల్ హోటల్ జంక్షన్, ఆర్‌కే బీచ్, భీమిలి, గాజువాక, పెందుర్తి పరిసరాల్లో షీ–టీమ్స్ అందుబాటులో ఉంటాయి. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే సంబంధిత షీ–టీమ్స్‌ను సంప్రదించాలి.
ప్రజలకు సూచనలు
మద్యం తాగి వాహనం నడిపితే కేసులు తప్పవు. అలాంటి వారి వాహనాన్ని స్టేషన్‌కు తరలిస్తాం. మరుసటి రోజు పని దినంలో ఒరిజినల్ టైసెన్స్, ఆర్‌సీతో స్టేషన్‌కు రావాలి. సమన్లు వచ్చినపుడు కోర్టులో హాజరుకావాలి.
మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా, 6 నెలల జైలుశిక్ష తప్పదు.
మైనర్లు వాహనాన్ని నడపరాదు. వారికి వాహనాలు ఇస్తే వాహన యజమానులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తీసివేయకూడదు. శబ్ధ కాలుష్యాన్ని నివారించాలి.
వాహనాలను అధిక వేగంతో, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేయరాదు.
Comments
Please login to add a commentAdd a comment