ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా
మహారాణిపేట : ఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 21,555 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎమ్మెల్సీఎన్నికల్లో 19,523 మంది ఓటర్లు ఉండగా..స్వల్పంగా పెరిగారు. గత నెల 23న ప్రకటించిన జాబితాలో మొత్తం 15,287 మంది ఓటర్లలో పురుషులు 9,638 మంది, సీ్త్రలు 5,649 మంది ఉన్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వారా 1,930 దరఖాస్తులు, ఆఫ్‌లైన్ ద్వారా 4,064 దరఖాస్తులు స్వీకరించారు. అదనంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను సోమవారం విడుదల చేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న పాకలపాటి రఘు వర్మ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29 నాటితో పూర్తవుతోంది. వచ్చే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నాటికి ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహిస్తారు.
జిల్లా పురుషులు మహిళలు మొత్తం
శ్రీకాకుళం 3,275 1,554 4,829
విజయనగరం 3,100 1,837 4,937
మన్యం పార్వతీపురం 1,532 730 2,262
అల్లూరి సీతారామరాజు 891 557 1,448
విశాఖపట్నం 2,403 2,874 5.277
అనకాపల్లి 1,747 1,055 2,802
మొత్తం 12,948 8,607 21,555
స్వల్పంగా పెరిగిన ఓటర్లు
Comments
Please login to add a commentAdd a comment