మన్యంపై చలి పంజా
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా చలిగాలులు అధికమయ్యాయి. పాడేరు డివిజన్లోని 11 మండలాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంది. పొగమంచు దట్టంగా కురుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలులు విజృంభిస్తున్నాయి. న్యూఇయర్ వేడుకులకు మన్యానికి వచ్చిన పర్యాటకులు ఫైర్ క్యాంపులను ఆశ్రయించారు. పొగమంచు, చలిగాలులు తీవ్రతతో ఏజెన్సీలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం డుంబ్రిగుడలో 9.0 చింతపల్లిలో 10.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్లోని అరకువ్యాలీలో 10.1,జి. మాడుగులలో 10.4 , పెదబయలులో 10.6, పాడేరులో 10.6, హుకుంపేటలో 11.0, అనంతగిరిలో 12.9, కొయ్యూరులో 15.7 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment