మహారాణిపేట: కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ప్రధాని మోదీ 8న విశాఖ పర్యటన నేపథ్యంలో అధికారులంతా ఏర్పాట్లలో ఉంటారని పేర్కొన్నారు.
జీవీఎంసీలో కూడా..
డాబాగార్డెన్స్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్టు జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖ నగరానికి విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చర్యల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు చెప్పారు.
భీమిలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో
జాబ్ మేళా రేపు
మురళీనగర్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ ఆధ్వర్యలో ఈ నెల 7న భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్‌మేళా నిర్వహిస్తున్న ట్లు జిల్లా నెపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ అధికారి టి.చాముండేశ్వరరావు తెలిపారు. ఈ మేళాలో హిప్పోక్లౌడ్ టెక్నాలజీస్, జయభేరి ఆటోమోటివ్స్, కేల్ గ్రూప్ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ (డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్), డిప్లమో (ఆటోమొబైల్), ఎంబీఏ, బీటెక్, ఏదైనా డిగ్రీ చదివిన యువతీయువకులు ఇంటర్వ్యూలకు అర్హులు. ఎంపికై న అభ్యర్థులు విశాఖపట్నం జిల్లాలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 90147 58949లో సంప్రదించవ చ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్‌కు ఆధార్ నంబర్, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో హాజరు కావాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment