మరో 10,600 టన్నుల బియ్యం రెడీ
టీడీపీకి చెందిన వ్యాపారి సీఎఫ్‌ఎస్‌లో ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో.. కార్గో బ్రోకర్స్ కంపెనీలన్నీ ఇక్కడి నుంచే రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా దేశాలు దాటించేస్తున్నాయి. గత నెల 12వ తేదీన 60 కంటైనర్లలో బియ్యం పంపించిన వ్యాపార సంస్థ.. ఇప్పుడు మళ్లీ మరో 10,600 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని పంపించేందుకు 20 కంటైనర్లను సిద్ధంచేసినట్లు సమాచారం. ఇప్పటికే రేషన్ బియ్యాన్ని వాటిల్లో లోడ్ చేసేశారనీ.. రెండ్రోజుల్లో చైనా నుంచి షిప్ రాగానే వాటిని పంపించేందుకు అన్ని ఏర్పాట్లుచేసినట్లు తెలిసింది. ఈ బియ్యం అక్రమ రవాణా వెనుక జిల్లా పౌర సరఫరా అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. అదంతా రేషన్ బియ్యం కాదని కొందరు అధికారులు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment