కదం తొక్కిన స్టీల్‌ప్లాంట్ కార్మికులు
మహారాణిపేట: సమస్యల సాధన కోసం స్టీల్‌ప్లాంట్ కార్మికులు కదం తొక్కారు. కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న వారు, సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉక్కు నగరం నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు భారీ బైక్ ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఉద్యోగులకు నాలుగు నెలల బకాయి జీతం వెంటనే చెల్లించాలని, విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేసి మూడేళ్లపాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని, విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని, నిలిపివేసిన 800 మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. దాదాపు 20 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ జీతాల కోసం ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment