నేటి నుంచి ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి
విశాఖ సిటీ: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ మంగళ, బుధవారాల్లో విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుందని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. ఏపీఈఆర్సీ ఇన్‌చార్జ్ చైర్మన్ ఠాకూర్ రామసింగ్, పీవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వీకరిస్తారని పేర్కొన్నారు. విజయవాడ కేంద్రంగా వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఈపీడీసీఎల్ పరిధిలోని ప్రజలు పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లను సంస్థ ఇప్పటికే పూర్తి చేసిందన్నారు. ఆసక్తి గలవారు తమ సమీప విద్యుత్ పర్యవేక్షణ ఇంజినీరు (ఎస్‌ఈ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఈఈ) కార్యాలయాల్లో సంప్రదించి ఏపీఈఆర్సీ అనుమతితో పాల్గొనవచ్చని సూచించారు. ఈ కార్యక్రమాన్ని http://eliveevents.com/ape rcpublichearing వెబ్‌లింక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షింవవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment