ప్రధాని పర్యటన విజయవంతం చేద్దాం
మహారాణిపేట: ప్రధాని మోదీ విశాఖ పర్యటనను విజయవంతం చేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రధాని ఈ నెల 8న విశాఖ రానున్న నేపథ్యంలో సహచర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికారులతో సర్క్యూట్ హౌస్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయేలా చేద్దామన్నారు. ఉత్తరాంధ్ర వైభవాన్ని చాటి చెప్పేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ప్రధాని శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయన్నారు. పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విప్‌లు పి.గణబాబు, చిరంజీవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment