జీవీఎంసీని సందర్శించిన కోర్బా మేయర్, కార్పొరేటర్లు
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, నగర సుందరీకరణ నిర్వహణ ఆకట్టుకున్నాయని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా నగర మేయర్ రాజా కిషోర్ ప్రసాద్, చైర్‌పర్సన్ శ్యామ్ సుందర్ సోని, 20 మంది కౌన్సిల్ సభ్యులు తెలిపారు. నగరాల అధ్యయన యాత్రలో భాగంగా కోర్బా నగర పాలక సంస్థ మేయర్, చైర్‌పర్సన్, కౌన్సిల్ సభ్యులు ఆదివారం విశాఖ విచ్చేశారు. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ నేతృత్వంలో వీరందరూ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరాన్ని సందర్శించారు. విశాఖ నగర పరిశుభ్రత, సుందరీకరణ ఆకట్టుకుందని, రోడ్ల అభివృద్ధి, కాలుష్య నియంత్రణ, పారిశుధ్య కార్మికుల విధి విధానాలు, నైట్ శానిటేషన్, భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ నిర్వహణ, స్వయం సహాయక సంఘాల సహకారం తదితర జీవీఎంసీ అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కోర్బా నగర మేయర్, చైర్‌పర్సన్ తెలిపారు. కోర్బా నగర మేయర్‌కు డిప్యూటీ మేయర్ శ్రీధర్, జీవీఎంసీ కార్యదర్శి బి.వి.రమణ జ్ఞాపిక అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment