బిల్లు.. గుబేల్
కొత్త ఏడాదిలోనూ విద్యుత్ షాక్
రూ.230 వరకు భారం పడింది
గత నెలలో 69 యూనిట్ల వినియోగానికి రూ.402 బిల్లు వచ్చింది. అదనపు చార్జీలు అన్నీ కలిపి రూ.230 వరకు పడ్డాయి. ఇలా బిల్లులు వస్తూ ఉంటే భరించడం ఎవరి తరమూ కాదు. ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలి.
– పాశల శివ, కొత్తపేట
తగరపువలస: నూతన సంవత్సరంలోనూ కూటమి ప్రభుత్వం ప్రజలకు విద్యుత్ షాక్ ఇచ్చింది. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో భారం మోపడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు ఒక్క రూపాయి కూడా పెంచనని, అవసరమైతే తగ్గిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ప్రజలపై ఎడాపెడా భారం మోపుతున్నారు. ఒకవైపు చలికి వణుకుతూ ఫ్యాన్లు, ఏసీలు వినియోగించకపోయినా, కూటమి ప్రభుత్వం వేస్తున్న బిల్లులు చూసి ప్రజలు వణికిపోతున్నారు. ఫ్యూయెల్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్(ఎఫ్‌పీపీసీఏ) పేరుతో గతేడాది నవంబర్‌లో ఒకసారి, డిసెంబర్‌లో రెండుసార్లు విధించగా.. ఇప్పుడు జనవరిలో మూడుసార్లు చార్జీలు విధిస్తున్నారు. ఈ చార్జీలు వినియోగించిన యూనిట్ చార్జీల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇవే కాకుండా ఫిక్స్‌డ్, కస్టమర్, ఈడీ చార్జీల పేరుతో ఒక్కో వినియోగదారుడిపై యూనిట్ శ్లాబులను బట్టి రూ.35 నుంచి రూ.65 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
అంతేకాకుండా బిల్లుల్లో వినియోగదారులకు సబ్సిడీ ఇస్తున్నట్లు చూపిస్తున్నా, ఆ మొత్తాన్ని వారికి తెలియకుండానే వినియోగించిన యూనిట్ చార్జీలకు కలిపి వసూలు చేస్తున్నారు. దీంతో తాము వాడిన కరెంట్ కంటే ఎక్కువ మొత్తం వస్తోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని చార్జీలు కలుపుకుని యూనిట్ రేటు కనీసం రూ.5 నుంచి గరిష్టంగా రూ.50 వరకు ఉంటుందని చెబుతున్నారు.
చలికాలంలోనూ బిల్లుల
మోత
5 యూనిట్లకు
రూ.220 బిల్లు
మాకు ఉన్న ఒక మీటరుకు సంబంధించి 5 యూనిట్లకు రూ.220, మరో మీటరులో 19 యూనిట్లకు రూ.280 బిల్లులు వచ్చాయి. విద్యుత్ కొనుగోలు సర్దుబాటు పేరుతో మూడుసార్లు 5 యూనిట్ల బిల్లుకు రూ.176, 19 యూనిట్ల బిల్లుకు రూ.208 భారం పడింది. ఇలాగైతే చాలామంది మీటర్లు స్వచ్ఛందంగా తొలగించుకోవాల్సి వస్తుంది.
– కుంచం రమణ,
తగరపువలస
34 యూనిట్లకు రూ.230 బిల్లు
గత నెల రోజుల్లో 34 యూనిట్లు విద్యుత్ వినియోగించగా బిల్లు రూ.230 వచ్చింది. ఇందులో విద్యుత్ వినియోగానికి శ్లాబు ప్రకారం కేవలం రూ.68 కాగా స్థిర, కస్టమర్, సర్ చార్జీలతో పాటు విద్యుత్ కొనుగోలు అడ్జెస్ట్‌మెంట్ పేరుతో మూడుసార్లు వడ్డించారు. ఈ మొత్తం రూ.168 అయింది. అంటే వినియోగించిన విద్యుత్‌కు రెండు రెట్లు అధనంగా బిల్లు వచ్చింది.
– జీరు సత్యారావు, చిట్టివలస
Comments
Please login to add a commentAdd a comment