600 ఎకరాల ఇనాం భూములపై టీడీపీ కన్ను
వారికి పంచుతున్నాడన్నారు. ఈరోజు కూడా సర్పంచ్ ఎర్రయ్యకు రూ.10 లక్షలు ఎరవేసి ప్రలోభపెట్టాలనుకున్నాడని ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు, భూ కబ్జాలపై వైఎస్సార్ సీపీ తరఫున కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేయనున్నామన్నారు.
బీసీ, దళిత ప్రజాప్రతినిధులపై జులుం
రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల దందాలను అరికట్టలేని సీఎం చంద్రబాబు, సకల శాఖల మంత్రి లోకేష్ తమ గెజిట్ పేపర్ ఈనాడు ద్వారా వారిపై ఆరోపణలు సంధిస్తున్నారన్నారు. 2014–19 హయాంలో అప్పటి మంత్రి దేవినేని ఉమ తిరుమల లడ్డూలు పక్కదారి పట్టించి నెలకు రూ.3 లక్షలు ఆర్జించాడన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూపై సనాతన ధర్మం పేరుతో గగ్గోలు పెట్టిన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అనధికార వసూళ్లు, పేకాట క్లబ్బులు, తిరుమల దర్శన సిఫార్సు లేఖలపై స్పందించి హిందూ సంప్రదాయాలను కాపాడాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారన్నారు. హోంశాఖ మంత్రి అనితతో పాటు ఎమ్మెల్యే గౌతు శిరీష, మంత్రి పార్థసారథితో టీడీపీ అధిష్టానం క్షమాపణలు కూడా చెప్పించిందన్నారు. ఇందంతా చూస్తుంటే కూటమి పాలనలో దళిత, బీసీ ప్రజాప్రతినిధులకు గౌరవం లేదన్నారు.
వైఎస్సార్ సీపీ కేడర్ బలంగా ఉంది
జిల్లాతో పాటు భీమిలిలో వైఎస్సార్ సీపీ బలం చెక్కు చెదరలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు, కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు, ఎంపీపీ కంటుబోతు రాంబాబు, మండల పార్టీ అధ్యక్షులు బంక సత్యం, గాడు శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, అక్కరమాని రామునాయుడు, పాండ్రంకి అప్పారావు, శిల్లా కరుణాకరరెడ్డి, నాయకులు బింగి హరికిరణ్‌రెడ్డి, గుడ్ల పోలిరెడ్డి, ఉప్పాడ సూర్రెడ్డి, కోరాడ అప్పలస్వామినాయుడు, ఎస్ చంద్రమౌళి, పాండ్రంగి శ్రీను, పిన్నింటి వెంకటరమణ, గండ్రెడ్డి శ్రీను, షిణగం దామోదరరావు, లెంక రాంబాబు, బొట్ట రామకృష్ణ, చందక సూరిబాబు, షిణగం అప్పలరాజు, మరుపిల్ల చిన్నయపాత్రుడు, వంకాయల మారుతీప్రసాద్, బోర సూర్రెడ్డి, కలిమి గంగరాజు, రౌతు శ్రీను, ఇల్లపు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు
దొంగ సభ్యత్వాలు
ఒక ఇంటి వద్ద కూర్చుని 280 సిమ్‌కార్డులు తెచ్చు కుని వారే డబ్బులు చెల్లించి దొంగ సభ్యత్వాలు చేయించారు. సర్పంచ్‌గా నాతో పాటు 10 మంది వార్డు సభ్యులు చేరినట్టు ఎలా ప్రచారం చేసుకుంటారు.
–షిణగం ఎర్రయ్య, సర్పంచ్
ఆందోళన చేస్తాం
పంచాయతీలో ఎవరికీ తెలియకుండానే సభ్యత్వాలు చేయించారు. ఓటీపీలు కూడా మా ఫోన్లకు రాలేదు. మాకు సంబంధం లేకుండా సభ్యత్వాలు తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై ధర్నా చేస్తాం.
–గుసిడి ముత్యాలు, ఎంపీటీసీ సభ్యుడు
7వ పేజీ తరువాయి
Comments
Please login to add a commentAdd a comment