శభాష్ బాల
ద్విచక్రాహనంపై విన్యాసాలు
ఆనందపురం మండలం గుడిలోవ విజ్ఞానవిహార పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే సాహస విన్యాసాలను విద్యార్థులు ప్రదర్శించారు. బాలురతో సమానంగా బాలికలు మల్లకంభంపై విన్యాసాలు, ద్విచక్రవాహనాలతో సాహసాలు, రోప్ డైవ్‌లు, ద్విచక్రవాహనాలు నడుపుతూ ఆసనాలు, గాలిలో దూకడం, అగ్ని చట్రంలో నుంచి దూసుకుపోవడం, ట్యూబ్‌లైట్లతో సాహసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. విద్యార్థులలో రామదీక్షిత్, ప్రణయ్, హర్షవర్థన్, విద్యాధరి, కావ్య, సాయిగీత, కార్తీక్ విన్యాసాలు విశేషంగా అలరించాయి.
–తగరపువలస
అగ్నిగోళం నుంచి దూకుతున్న విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment