జీవీఎంసీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు
డాబాగార్డెన్స్: ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం ఆదివారం జీవీఎంసీని సందర్శించింది. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు నగరంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల పనితీరును అధికారులు వారికి వివరించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరం, మేయర్, కమిషనర్ చాంబర్లను పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖకు లభిస్తున్న సింగిల్ డిజిట్ ర్యాంక్‌లు, సాధించిన అవార్డులను ట్రైనీ ఐఏఎస్‌లకు జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ పి.శివప్రసాదరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎన్ రవి, డిప్యూటీ సిటీ ప్లానర్ హరిదాసు, ఎస్‌ఆర్‌యూ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస రాజమణి వివరించినట్టు అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి తెలిపారు. అనంతరం వీఎంఆర్‌డీఏ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సంస్థ అధికారి శ్రీనివాస్ రాజమణి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment