ఇతర భాషలపై కూడా పట్టు అవసరం
సబ్బవరం: న్యాయ విద్యార్థులు ఇతర భాషలపై కూడా పట్టుసాధించాలని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం విజిటర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ సూచించారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని అన్ని భవనాలతో పాటు గ్రంథాలయాన్ని సందర్శించారు. అనంతరం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి.సూర్యప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ పీఠికలోని ‘మన కోసం మనం రూపొందించుకున్న రాజ్యాంగం’ అనే అంశంపై ప్రసంగించారు. తెలుగు విద్యార్థులు సైతం ఇతర భాషలపై పట్టు సాధించాలన్నారు. కొత్త భాష నేర్చుకోవడం అంటే కొత్త విజ్ఞానాన్ని, ప్రవీణ్యాన్ని సంపాదించుకోవడమేనని సూచించారు.
న్యాయ విద్యార్థులంతా లక్ష్యాలను చేరుకుని చదువుకున్న విశ్వవిద్యాలయానికి పేరుతీసుకురావాలన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ విశ్వచంద్రనాఽథ్, చీఫ్ వార్డెన్ భాగ్యలక్ష్మి, జోగినాయుడు పాల్గొన్నారు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ
Comments
Please login to add a commentAdd a comment