15న అప్పన్న మకరవేట ఉత్సవం
సింహాచలం: కనుమ పండగను పురస్కరించుకుని ఈనెల 15వ తేదీన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మకరవేట(గజేంద్రమోక్షం) ఉత్సవం కొండదిగువ పూలతోటలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి వరదరాజస్వామి అలంకరణ చేసి బుధవారం సాయంత్రం కొండదిగువకి మెట్లమార్గం ద్వారా తీసుకొస్తారు. కొండదిగువ ఉన్న పూలతోటలోని ప్రధాన మండపంలో స్వామిని వేంజేంచేసి గజేంద్రమోక్షం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామికి విశేష పూజలు చేస్తారు. అనంతరం స్వామిని పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి గజవాహనంపై అధిష్టిస్తారు. తరువాత అడవివరం గ్రామ పురవీధుల్లో గజవావానంపై స్వామికి తిరువీధి నిర్వహిస్తారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని పూలతోట ముస్తాబు చేశారు. కాగా గజేంద్రమోక్షం ఉత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపై స్వామివారి మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment