జరజాపుపేట... రక్తదాతల కోట
–8లో
ఆపదలో ఉన్నవారికి రక్తం కావాలంటే.. ఠక్కున గుర్తొచ్చేది విజయనగరానికి చేరువలో ఉన్న జరజాపుపేట.. అక్కడ ఉన్న సాధన యువజన సంఘం సభ్యులు. ఆపద సమయాన రక్తందానం చేసి ఆదుకోవడం వారి నైజం. కళ్లముందే రక్తం అందక తోటి విద్యార్థి మృతిని తట్టుకోలేని విద్యార్థులు... సుమారు 16 ఏళ్లుగా ఓ సంఘంగా ఏర్పడి రక్తదాన యజ్ఞాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్నారు. గ్రామాన్ని రక్తదాతలకు కేరాఫ్‌గా మార్చారు. ఆ గ్రామ యువత సేవలను కేంద్ర ప్రభుత్వం మెచ్చింది. అవార్డుతో సత్కరించింది. రక్తదానం చేసి ప్రాణాలు నిలపడంలో వారు చేస్తున్న ‘సాధన’కు ‘సాక్షి’ అక్షరరూపం.
సేవల్లో మేటి
గాడి తప్పిన గ్రామ స్వరాజ్యం
టీడీపీ కూటమి పాలనలో సచివాలయం, ఆర్‌బీకేల సేవలు అందని ద్రాక్షగా మారాయి. ప్రజలకు ఆవేదన మిగుల్చుతున్నాయి.
అదృష్టంగా భావిస్తున్నాం
రక్తదానం చేయడం మా సాధన సంఘ సభ్యులందరూ అదృష్టంగా భావిస్తారు. అందుకే.. 60 మందితో ఏర్పడిన సంఘ సభ్యుల సంఖ్య 500కు చేరింది. మా కుటుంబ సభ్యులతో పాటు యువతను రక్తదానానికి ప్రోత్సహిస్తాం. ఇప్పటి వరకు 16 సార్లు రక్తదానం చేశాను.
– పోలుబోతు ఆనంద్, సంఘం సభ్యుడు,
జరజాపుపేట
మాది అంతా రక్తదాతల
కుటుంబం
ఉద్యోగ రీత్యా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడ పనిచేస్తున్నా... అందరం రక్తదానశిబిరాలకు క్రమం తప్పకుండా హాజరవుతుంటాం. మాది అంతా ఓ రక్తదాతల కుటుంబం. కలిసిమెలసి మెలగుతాం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్నదే మా ‘సాధన’ లక్ష్యం. వేసవి కాలంలో చలివేంద్రాలు విరివిగా ఏర్పాటుచేసి పాదచారుల దాహార్తి తీర్చుతున్నాం. ఇప్పటి వరకు 35 సార్లు రక్తదా నం చేశాను. – మద్దిల రాంబాబు,
సంఘం సభ్యుడు, జరజాపుపేట
ఏ సమయంలోనైనా..
ఎవరికి ఏ సమయంలో రక్తం అవసరమైనా సరే మేమంతా వెంటనే స్పందించి వారికి కావాల్సిన రక్తాన్ని అందిస్తాం. అందువల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగాం. అది మా అదృష్టంగా భావిస్తాం. బ్లడ్, ఐ క్యాంపులు అనేక సార్లు నిర్వహించాం. ఇప్పటివరకు 47 సార్లు రక్తదానం చేశాను.
– అవనాపు జీవన్‌రావు, సంఘ సభ్యుడు, జరజాపుపేట
63 సార్లు రక్తదానం
18 ఏళ్ల వయస్సు నుంచి రక్తదానం చేస్తున్నా. ఇప్పటివరకు 63 సార్లు రక్తదానం చేశాను. గర్భిణులు, క్షతగాత్రులు, తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా బాధితులకు, గుండె ఆపరేషన్లకు, డెంగీ పేషెంట్లకు, క్యాన్సర్ రోగులకు తక్షణమే బ్లడ్ అందించేందుకు సంస్థను స్థాపించాం. అదే లక్ష్యంగా మా సంఘం నిరంతరం సేవలందిస్తోంది.
– పి.దుర్గాప్రసాద్, అధ్యక్షుడు,
సాధన యువజన సంఘం, జరజాపుపేట
నెల్లిమర్ల: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం. అటువంటి రక్తదాన కార్య క్రమాన్ని నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధిలోని జరజాపుపేటకు చెందిన యువత ఒక యజ్ఞంలా సాగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, యువత సాధన యువజన సంఘంగా ఏర్పడి నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ జిల్లాలో రక్తం కొరతను తీర్చడంలో తమదైన భూమిక పోషిస్తున్నారు. ఆపద సమయాన నేరుగా బ్లడ్‌బ్యాంకుకు వెళ్లి రక్తం దానం చేస్తూ వందలాదిమందికి ప్రాణదానం చేస్తున్నారు. రక్తదానం చేయడం ఒక అదృష్టంగా భావిస్తూ
అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు.
జరజాపుపేట ఉన్నత పాఠశాలలో 2007–08 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి రాచర్ల సురేష్ రక్తం దొరకక బ్లడ్ కాన్సర్‌తో మృతిచెందాడు. ఈ ఘటన మిగిలిన విద్యార్థులను కదిలించింది. ఇక నుంచి ఎవరూ రక్తం కొరతతో చనిపోకూడదని నిర్ణయానికి వచ్చారు. రక్తదాన కార్యక్ర మానికి అంకురార్పణ చేశారు. 60 మందితో సాధన యువజన సంఘాన్ని ఏర్పాటుచేసి 2008 ఫిబ్రవరి 17న తొలిసారి గ్రామంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నేటికి సుమారు 200 శిబిరాలు నిర్వహించి వేలాది యూనిట్ల రక్తం దానం చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. 60 మందితో ఏర్పడిన సాధన యువజన సంఘం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 500 దాటింది. రక్తదానం ఓ క్రతువుగా సాగుతోంది.
సేవా మార్గం
తోటి విద్యార్థి మరణంతో
రక్తదానానికి అంకురార్పణ..
ఆపద్బాంధవులు
సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న
జరజాపుపేట యువత
రక్తదానంతో ఆదుకుంటున్న సాధన యువజన సంఘం సభ్యులు
వారి సేవలకు జాతీయ స్థాయిలో
గుర్తింపు
సంఘ సభ్యులు రక్తదాన కార్యక్రమాలతో పాటు ఉచితంగా నేత వైద్యశిబిరాలు, చలివేంద్రాల నిర్వహణ, వద్ధాశ్రమాలకు ఆహారం అందజేయడం, గ్రంథాలయాలకు పుస్తకాల పంపిణీ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏటా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ, జాతీయ నాయకులు, సంఘం సభ్యుల పుట్టినరోజు, పెళ్లిరోజు కార్యక్రమాలను పురస్కరించుకుని మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలతో సమాజానికి తమవంతు సేవలందిస్తున్నారు. వీరి సేవలకు మెచ్చి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌కు చెందిన కన్నతల్లి ఫౌండేషన్ సంస్థ సంక్రాంతి జాతీయపురస్కారాన్ని ఈ ఏడాది జనవరిలో అందజేసింది. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఇటీవల నిర్వహించిన జాతీయ రక్తదాన దినోత్సవంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ అతుల్ గోయల్ సాధన సంఘానికి అవార్డును ప్రదానం చేశారు. సంఘ అధ్యక్షుడు పోలుబోతు దుర్గాప్రసాద్ ఇటీవల అవార్డును అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment