విద్యార్థి మృతికి హాస్టల్ సిబ్బందిదే బాధ్యత
విజయనగరం పూల్‌బాగ్: పట్టణంలో ఉన్న బీసీ హాస్టల్లో కొణతాల శ్యామలరావు అనే విద్యార్థి అనారోగ్యంతో హఠాన్మరణం చెందాడు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాము, వెంకటేశ్ మాట్లాడుతూ విద్యార్థి శ్యామలరావు మరణించడానికి ప్రధాన కారణం హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే అని ఆరోపించారు. హాస్టల్ వార్డెన్ జానకిరామ్ గతంలో కూడా అనేక సార్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని, అసలు హాస్టల్‌కు ఎన్నో సార్లు ఆబ్సెంట్ అవుతూ విద్యార్థులను పట్టించుకునే వారు కాదని విమర్శించారు. గత రాత్రి విద్యార్థి అస్వస్థతకు గురైతే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని, కనీసం హాస్పిటల్‌కు కూడా తీసుకువెళ్ల లేదని విమర్శించారు. వార్డెన్ మీద నమ్మకంతోనే పేరెంట్స్ వారి పిల్లలను హాస్టల్లో చేర్పిస్తారని, అలాంటిది ఈరోజు ఆ విద్యార్థి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారని దుయ్యబట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన హాస్టల్ వార్డెన్‌ను, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో కుమారుడిని కోల్పోయి దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కచ్చితంగా ప్రభుత్వం ఈ డిమాండ్లు నెరవేర్చాలని లేనిపక్షంలో విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని దీనికి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వార్డెన్‌ను సస్పెండ్ చేయాలి
బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి
ఎస్ఎఫ్ఐ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment