ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో.. అడ్డగోలు నియామకాలు!
‘ బోనంగి, గంట్యాడ, పెంట శ్రీరాంపురం సొసైటీల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా మంత్రి బంధవు చెప్పిన వారికే కట్టబెట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ సిబ్బందిలో కూడా అనర్హులే అధికమన్నది రైతుల వాదన.
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిలో అర్హత, అనుభవం లేని సిబ్బంది నియామకాలు ప్రస్తుతం రైతన్నలను కలవరపెడుతున్నాయి. వాస్తవంగా ధాన్యం నాణ్యత, తేమ శాతాన్ని గుర్తించి గ్రేడ్‌ను నిర్ణయించాలి. ఆ మేరకు రైతన్నకు మద్దతు ధర లభిస్తుంది. వ్యవసాయ విద్యను అభ్యసించనివారు, పంట నాణ్యత తెలియని వారు కొనుగోలు కేంద్రాల సిబ్బందిగా నియామకం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనలకు పాతరేసి పచ్చపార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులకు పోస్టు లు కట్టబెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవం ఉన్న వారిని పక్కన పెట్టేయడంపై నిరుద్యోగులతో పాటు రైతు లు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై ఎటువంటి అవగాహన లేనివారిని నియమించడంపై విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి.
● 258 క్లస్టర్లలో 774 మంది నియామకం
జిల్లాలో 507 రైతు భరోసా కేంద్రాలు (రైతు సేవా కేంద్రాలు) ఉన్నాయి. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 258 క్లస్టర్స్‌ను ఏర్పాటుచేశారు. వీటిలో పనిచేయడానికి ఒక్కో కేంద్రానికి ముగ్గురు చొప్పున 774 మందిని నియమించారు. ఒక్కో కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్, టెక్నికల్ అసిస్టెంట్ నియామకమయ్యారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులకే పోస్టులు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హత, అనుభవం ఉన్న వారికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది నియామకంలో ప్రాధాన్యమిచ్చేవారు. హెల్పర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. వీటిలోఽ వ్యవసాయ విద్యను అభ్యసించేవారికి తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. అర్హత, అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని నియమించారు. దీనివల్ల పార్టీలకు అతీతంగా అర్హులకు పోస్టులు దక్కాయి. రైతులకు మేలు జరిగింది.
ఆరుగాలం శ్రమించి రైతన్నలు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలంటే అనుభవం, అర్హత ఉండాలి. వరి సాగుపై అవగాహన కలిగి ఉండాలి. నాణ్యత, తేమ శాతం పక్కాగా గుర్తించగలగాలి. ప్రస్తుతం జిల్లాలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో నియామకమైన చాలామంది సిబ్బందికి వరి పంట సాగే తెలియదట. వ్యవసాయ కోర్సులూ చదవలేదు. అధికార పార్టీ నేతల అండదండలే అర్హతగా.. అరకొర చదువులతోనే కొనుగోలు
కేంద్రాల్లో పోస్టులు సాధించారు. వీరిని చూసిన రైతులు ధాన్యం విక్రయానికి భయపడుతున్నారు. గ్రేడ్ నిర్ణయంలో తేడా చూపిస్తే మద్దతు ధర కోల్పోతామని ఆందోళన చెందు తున్నారు. రైతు శ్రమ లెక్కింపు ప్రక్రియలో రాజకీయ జోక్యాన్ని తప్పబడుతున్నారు.
నియామకాలు పూర్తయ్యాయి..
జిల్లాలో 258 క్లస్టర్ కొనుగోలు కేంద్రాలకు సిబ్బంది నియామకాలు జరిగిపోయాయి. గతేడాది నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించి సివిల్ సప్‌లై ద్వారా పోస్టుల భర్తీ చేపట్టారు. ఈ ఏడాది సిబ్బంది నియామకాలను సొసైటీ అధికారులే చేపట్టారు.
– మీనాకుమారి,
సివిల్ సప్‌లై జిల్లా మేనేజర్
అనుభవం ఉన్నవారిని పక్కన
పెట్టిన వైనం
పోస్టులన్నీ తెలుగు తమ్ముళ్లకే..!
జిల్లాలో 774 మంది నియామకం
అర్హులకు పోస్టులు దక్కకపోవడంపై
ఆవేదన
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
దరఖాస్తులు స్వీకరించి అర్హత,
అనుభం ఉన్నవారికి ప్రాధాన్యం
టీడీపీ కూటమి తీరుపై
రైతుల అసహనం
Comments
Please login to add a commentAdd a comment