విజయనగరం: సంస్థాగతంగా పార్టీ బలోపేతంలో భాగంగా వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ పరంగా నూతన నియమాకాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో పలు నియోజకవర్గాలకు సంబంధించి నాయకులకు నూతనంగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన జారీ చేశారు. జిల్లాలోని బొబ్బిలి మున్సిపాలిటీ వింగ్ అధ్యక్షుడిగా ఎస్.మురళీకృష్ణ, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షేక్ అన్వర్ బాషాను నియమించారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్‌గా వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, బూత్ కమిటీల అధ్యక్షుడిగా బూర్లె నరేష్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా గజపతినగరం నియోజకవర్గానికి సంబఽంధించి ,రైతు విభాగం అధ్యక్షుడిగా మంత్రి అప్పలనాయుడు, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పీరుబండి జైహింద్ కుమార్, వలంటీర్స్ వింగ్ ఽఅధ్యక్షుడిగా వేమలి ముత్యాలనాయుడును నియమించారు. రాజాం నియోజకవర్గానికి సంబఽంధించి వీవర్స్ వింగ్ అధ్యక్షుడిగా డి. శ్రీనివాసరావు, కల్చరల్ వింగ్ అధ్యక్షుడిగా డాక్టర్ బలివాడ నరేంద్రకుమార్, సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడిగా ఎలకల వాసునాయుడు, ఐటీ వింగ్ అధ్యక్షుడిగా గంధవరపు హేమంత్‌కుమార్‌లను నియమించారు. విజయనగరం నియోజకవర్గానికి సంబఽంధించి మహిళా విభాగం అధ్యక్షురాలిగా గదల సత్యలత, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కేదారిశెట్టి సీతారామ్మూర్తి, లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎ.నాగవెంకట అంజనీకుమార్, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా దవడ కొండబాబు, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడిగా విన్నకోట శివప్రసాద్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారంతా జిల్లా పార్టీకి ఆయా విభాగాల అనుబంధ సంఘాలకు అధ్యక్షులుగా వ్యవహరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాకు..
పార్వతీపురంటౌన్: వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులను ని యమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్సార్‌సీపీ అధ్యక్షు డు జగన్‌మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు మై నారిటీ సెల్ అధ్యక్షుడిగా షేఖ్ షఫీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎస్. శ్రీనివాసనావును నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment