గజపతినగరం: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి వద్ద కారు ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఓయువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న కారు గజపతినగరం రైల్వేస్టేషన్ జాతీయ రహదారి వద్ద పురిటి పెంట గ్రామానికి చెందిన బాలి జోగినాయుడిని బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన జోగినాయుడిని విజయనగరం మహరాజా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు స్థానికులు చెప్పారు. పోలీసులు కారును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సిటీబస్సు ఢీకొని వీఆర్‌ఏకు..
కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్కవరపుకోట తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న కె.మాధవి తీవ్రంగా గాయపడ్డారు. తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన మాధవి విధులకు వెళ్లడానికి నడుచుకుంటూ బ్రిడ్జి వద్దకు వెళ్తుండగా సిటీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం జరిగింది. వెంటనే స్థానికులు విశాఖపట్నం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment