ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
విజయనగరం అర్బన్: తుఫాన్ వర్షాలకు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్త చర్యలను తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులకు సూచించారు. నూర్పిడి పూర్తిచేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా జిల్లాలో ఏ ఒక్క రైతుకూ పంట నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. జిల్లాపై వర్షాల ప్రభావం తన చాంబర్ నుంచి మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఇతర మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో శుక్రవారం సమీక్షించారు. ఇప్పటివరకు నూర్పిడిచేసిన 2.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉండగా 1.83 లక్షల టన్నులను కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. పంట సంరక్షణకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందజేయాలని సూచించారు. గంట్యాడ, చీపురుపల్లి, గరివిడి మండలాలకు చెందిన పలువురు రైతులతో కలెక్టర్ నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీ ఎస్.సేతుమాధవన్, సివిల్ సప్లయీస్ డీఎం కె.మీనాకుమారి, జిల్లా వ్యసాయాధికారి వీటీ రామారావు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment