ప్రయాణికుల భద్రతే ప్రధానం
విజయనగరం అర్బన్: ప్రమాణికుల భద్రతే లక్ష్యంగా రవాణా సేవలను సంస్థ అందిస్తోందని, ఆ దిశగా ఉద్యోగులు పనిచేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. విజయనగరం ఆర్టీసీ డిపో ఆవరణలో శుక్రవారం జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత 10 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. రెండు బస్సులు విజయనగరం నుంచి శ్రీకాకుళానికి, మిగిలినవి అనకాపల్లి, శ్రీకాకుళం డిపోలకు చెందినవి ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లు వంటివారని, ఎటువంటి సమస్యలు వచ్చినా ఆందుకుంటామన్నారు. రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక సంస్థను నిలబెడిటే ఆ సంస్థ మనకు భవిష్యత్తును ఇస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన డ్రైవర్లు, కండక్టర్లకు ప్రశంసా పత్రాలను, నగదు పారితోషికాన్ని మంత్రి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పి.అదితిగజపతిరాజు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ దున్నదొర, ఆర్టీసీ ఈడీ విజయకుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ, డిప్యూటీ సీటీఎం సుధాబిందు, ఆర్టీసీ యూనియన్ ప్రతినధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలపై వివిధ యూనియన్ ప్రతినిధులు మంత్రికి వినతులు అందజేశారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి
రాంప్రసాద్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment