● గ్రామీణ సర్వీసులకు ఆర్టీసీ దూరం ● విజయవాడకు 4 ప్రత్యే
విజయనగరం అర్బన్:
ఆర్టీసీ సేవలకు సంక్రాంతి పండగ తిరుగు ప్రయాణికుల సందడి గురువారం ఉదయం నుంచి ప్రారంభమైంది. సంక్రాంతి సందర్భంగా దూర ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చిన జిల్లా వాసు లు మూడు రోజుల పండగను ముగించుకొని తిరు గు ప్రయాణం సాగిస్తున్నారు. ప్రైవేటు బస్సుల ప్రయాణాల్లో అభద్రత ఇటీవల వెలుగులోకి రావడంతో ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. రవాణా అధికారులు దాడులతో ప్రైవేటు సర్వీసు లు తగ్గాయి. మరోవైపు రైల్వే రిజర్వేషన్‌లు దొరకని వారు సంఖ్య పెరిగింది. దీంతో దూర ప్రాంతాల ఆర్టీసీ సేవలకు రద్దీ పెరిగింది. జిల్లా కేంద్రం నుంచి ఈ నెల 15వ తేదీ నుంచి ప్రతి రోజు సాయత్రం 05.00 గంటల నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒకటి చొప్పున విశాఖ మీదుగా దూర ప్రాంతాలకు సర్వీసులను పెంచారు. డైరెక్టు విజయవాడకు 4 బస్సుల ను తిప్పుతున్నారు. ఆదివారం వరకు సెలవులున్న నేపథ్యంలో అంతవరకు ఈ సర్వీసులను కొనసాగిస్తున్నామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఒక్కో గంట వ్యవధిలో విశాఖ మీదుగా విజయవా డ సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. రద్దీను బ ట్టి ఈ సర్వీసులను ప్రతిరోజూ కొనసాగిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవి కాకుండా పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నుంచి జిల్లా కేంద్రం మీదుగా విశాఖ, ఆపై వెళ్లే దూరప్రాంతాల స ర్వీసులు మరో 8 వరకు ఉన్నాయి. దీంతో జిల్లా కేంద్రం నుంచి వెళ్లే ప్రతి బస్సు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. జిల్లా కేంద్రం నుంచి విశాఖకు ప్రతి 5 నిమిషాలకు ఒకటి వంతున రాత్రి 10 గంటల వరకు సర్వీసులు నడుపుతున్నారు. అయితే దూరప్రాంతాలకు వెళ్లే కొన్ని సర్వీసులో చార్జీల అధికంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో టిక్కెట్ మీద అదనంగా మరో 50 శాతం వరకు వడ్డిస్తున్నారు. ఇదేంటని అడిగితే రిటన్ సర్వీసుల్లో టిక్కెట్‌లు ఉండవు కాబట్టి తప్పదని ఆర్టీసీ అధికారులు తెగించి చెబుతున్నారు.
గ్రామీణ సర్వీసులకు ఆర్టీసీ దూరం
ఉమ్మడి విజయనగరం జిల్లాల గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులకు ఆర్టీసీ సంక్రాంతి పండగ సర్వీసులు ఈ ఏడాది భారీగా తగ్గించారు. ప్రధానంగా బొబ్బిలి, సాలూరు, విజయనగరం, పార్వతీపురం పట్టణాల నుంచి సమీప రూరల్ ప్రాంతాలకు ప్రతి రోజూ తిరిగే సర్వీసులను రద్దు చేయడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతాల ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ఆయా పట్టణాల నుంచి గ్రామీణ సర్వీసు లు రద్దు చేయడం వల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రైవేటు వాహనాలకు డిమాండ్ పెరగడంతో చార్జీల మోత తప్పలేదు.
బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ
Comments
Please login to add a commentAdd a comment