అదిరిందయ్యా... రాజా...
అదిరిందయ్యా.. రాజా.. విందు భోజనం అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్‌వీ రమణరాజును అభినందించారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి సోమలింగాపురంలోని తమ ఇంటికి రావాలని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రమణరాజు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లను ఆహ్వానించారు. దీంతో వారు ముక్కనుమ రోజున గురువారం రమణరాజు ఇంటికి వచ్చారు. విందు భోజనాన్ని ఆరగించారు. అనంతరం అక్కడున్న పార్టీ శ్రేణులతో సెల్ఫీలు దిగారు. – మెరకముడిదాం
Comments
Please login to add a commentAdd a comment