సీసీ రోడ్లకు రూ.8 కోట్లతో ప్రతిపాదనలు
● పీఆర్ ఈఈ రమణమూర్తి
బొబ్బిలి: డివిజన్ పరిధి లోని మూడు నియోజకవర్గాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్టు పంచాయతీరాజ్ ఈఈ (ఎఫ్‌ఏసీ) టీవీ రమణమూర్తి తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. డివిజన్‌లో మరమ్మతులకు గురైన పీఆర్ తారు రోడ్లకు రూ.24 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లో రూ.74 కోట్లతో 1047 పనులు చేపడుతున్నామన్నారు. పనులు జరు గుతున్నాయని చెప్పారు.
ఎస్‌టీ వలసలో ఆర్డీఓ సందర్శన
దత్తిరాజేరు: మండలంలోని షికారుగంజి పంచాయతీ ఎస్‌టీ వలస గ్రామాన్ని ఆర్డీఓ రామ్మోహనరావు గురువారం సందర్శించారు. కొండపైన నివాసం ఉంటున్న 40 కుటుంబాల గిరిజ నులు గతంలో తాము నివాసం ఉంటున్న చోట కనీస సౌకర్యాలు లేవని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ అప్పట్లోనే వారి సమస్య లు అడిగి తెలుసుకున్నారు. సాగు భూమి పట్టాలను మంజూరు చేసి తాము నివాసం ఉంటు న్న చోట గృహాలు మంజూరు చేయాలని, విద్యుత్, తాగునీరు, పాఠశాల ఏర్పాటు చేయా లని తదితర కనీస సదుపాయాలు కల్పించాల ని కోరారు. దీనిపై ఆర్డీఓ గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యలపై కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్టు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ విజయభాస్కర్, ఆర్‌ఐ నారాయణరావు, వీఆర్‌ఓ రాము తదితరులు ఉన్నారు.
‘ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు’ పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: నగరంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మెయిన్ బ్రాంచ్ పక్కన ఉన్న సిమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో డాక్టర్ వనజ చొప్పల రచించి న ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు – అర్ధములు ఒకటో సంపుటిని గురువారం ఆవిష్కరించారు. సంఘమిత్ర, చర్చి ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్.జాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రసంగీకులు రెవరెండ్ డాక్టర్ ఎబి.జోసఫ్ కిశోర్, జేమ్స్ జయశీల్ చౌదరి తదితరులు చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. కార్యక్రమంలో శుభ డేవిడ్, సుమిత్ర ఎస్తేర్, ఆశాజాన్ అధిక సంఖ్యలో క్రీస్తు ఆరాధకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment