విజయనగరం అర్బన్: ప్రధానమంత్రి ఇంటెన్షి
షిప్ పథకానికి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్‌కుమార్ గురువారం తెలిపారు. ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఐటీఐ, పాలిటెక్నికల్, బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీఫాం వంటి డిగ్రీ విద్యార్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ‘పీఎంఇంటెన్షిప్.ఎంసీఏ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్ ద్వారా ఇంటెన్షిప్ కోసం ఆధార్, బయోడేటాతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఎంపికై న వారికి 12 నెలల పాటు రూ.5 వేల చొప్పున అందిస్తారని, ఏకకాలం గ్రాంటు కింద రూ.6 వేలు కూడా ఇస్తారని తెలిపారు. 21–24 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం 96187 92572 నంబరును సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment