భుజంగరావు బంగారం
తన ఇబ్బందులు కుటుంబానికి రాకుండా
భుజంగరావు మంచి భవిష్యత్‌కోసం పరితపిస్తున్నాడు. 2019లో పొందూరుకు చెందిన నాగమణి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె నిహారిక 1 వ తరగతి పెనుబాక పాఠశాలలో చదువుతోంది. రెండవ కుమార్తె సాత్విక ఏడాదిన్నర వయస్సు ఉంటుంది. తాను కుటుంబానికి భారం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో స్టేజ్ షోలు చేస్తున్న భుజంగరావు అవకాశాలు వచ్చినప్పుడల్లా బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి టీవీషోలు, సినీ ప్రమోషన్ షోల్లో తన డ్యాన్స్‌తో ప్రతిభ చాటుతున్నాడు. నిత్యం ఏదో ఒక స్టేజ్ షో చేస్తూ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాడు.
హైదరాబాద్‌లోని
కళాభారతి షోలో
భుజంగరావు డ్యాన్స్
పెర్‌ఫార్మెన్స్
భుజంగరావు స్వగ్రామం తెర్లాం మండలంలోని ఉద్దవోలు. తల్లిదండ్రులు మరియమ్మ, జోగారావులు రోజువారీ వలస కూలీలు కావడంతో రాజాం మండలం పెనుబాక రావడంతో ఇక్కడికి వచ్చిన భుజంగరావు నాలుగు కిలోమీటర్ల దూరంలోని బొద్దాం జెడ్పీ హైస్కూల్‌లో చేరి పట్టుదలతో 10వ తరగతి వరకూ చదివాడు. ప్రతిరోజూ ట్రై సైకిల్‌పై వెళ్లి, ఒక పూట తినకుండా పస్తులు ఉంటూ ఆ రోజుల్లో పదవతరగతి పూర్తిచేశాడు. అనంతరం రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన ఆయనను రాజాంలోని పలువురు దాతలు ప్రోత్సహించారు. ఫలితంగా సామర్లకోటలో తెలుగు పండిట్ ట్రైనింగ్ కళాశాలలో తెలుగు పండిట్ కోర్సు పూర్తిచేశాడు. అనంతరం రెండు డీఎస్సీలకు ప్రిపేరయ్యాడు. ఒకటి రెండు మార్కులతో టీచర్ ఉద్యోగాన్ని కోల్పోయిన బంగార్రాజు తన పట్టు వదలలేదు. తాను 8 వ తరగతి చదువుతున్న సమయం నుంచే రాజాంలోని బాలభవన్ బాటపట్టాడు. అక్కడి డ్యాన్స్ మాస్టర్ సుంకరి రమేష్ ప్రోత్సాహంతో పాటు డ్యాన్స్ మాస్టర్ తారక్ సారథ్యంలో డ్యాన్స్ నేర్చుకుని మంచి డ్యాన్సర్‌గా ఖ్యాతి గడించాడు. పదిమంది దివ్యాంగులను ఒక్కటిగా చేసి డ్యాన్స్ ట్రూప్ తయారుచేసుకుని, తాను బతుకుతూ పదిమందిని బతికిస్తూ ముందుకువెళ్తున్నాడు.
ఎన్నో షోలు..
భుజంగరావు ఇప్పటివరకూ 40కిపైగా టీవీ, ప్రమోషన్ షోల్లో నటించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీలోని కాంచన సినిమాలో నిల్చో..నిల్చో సొంత కాళ్లపైన నిల్చో అనే పాటకు మణికంఠ మాస్టర్ టీమ్‌లో డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అనంతరం ఢీ సెలబ్రెటీ స్పెషల్–1లో మణికంఠ మాస్టర్ కొరియగ్రాఫ్‌లో డ్యాన్స్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఏడాది క్రితం మారో మారో గోలీ మారో సాంగ్‌లో పెరఫార్మెన్స్ చేశాడు. చంద్రముఖి–2 సినిమా ప్రీ రిలీజ్‌లో దంచుకోట సాంగ్‌కి లారెన్స్ మాస్టర్ సారథ్యంలో డ్యాన్స్ చేసి బహుమతి పొందాడు. గతేడాది 31న పుష్ప–2 సినిమాలోని గంగో రేణుకా తల్లి సాంగ్‌కి డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. పెద్దపెద్ద సినీ నటులు, సెలబ్రిటీలతో పరిచయాలు ఉన్న భుజంగరావు తోటి దివ్యాంగులకు చేయూతనివ్వడమే లక్ష్యంగా, రాజాం చుట్టు పక్కల దివ్యాంగులకు ఏదో ఒక కళ ఉండాలని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఇటీవల ఎన్‌టీఆర్ సినీ వజ్రోత్సవ అవార్డును విశాఖపట్నంలో పౌర గ్రంథాలయంలో సినీ ప్రముఖల చేతుల మీదుగా అందుకున్నాడు. అంతకుముందు కాకినాడలో చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పురస్కారం అందుకున్నాడు. ప్రైవేట్ షోల్లో పలు పురస్కారాలు భుజంగరావును వరించాయి.
–రాజాం
డ్యాన్స్‌లో రాణిస్తున్న యువకుడు
అంగవైకల్యాన్ని ఎదురించి జీవనపోరాటం
మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూపు
మంచి టీచర్‌గా..
మంచి డ్యాన్సర్‌గా పేరుకోసం..
నాకు చిన్నప్పటినుంచి టీచర్ అవ్వాలని ఉండేది. అందుకే ఎంతో కష్టపడి తెలుగుపండిట్ ట్రైనింగ్ అయ్యాను. నేను శిక్షణ పొంది బయటకు వచ్చిన తరువాత డీఎస్సీలు తగ్గిపోయాయి. తెలుగు పండిట్ టీచర్ పోస్టులు కూడా పెద్దగా లేవు. చిన్నప్పటినుంచి ఎంతో ఇష్టంతో నేర్చుకున్న డ్యాన్స్ ఇప్పుడు జీవనోపాధి కల్పిస్తోంది.
భుజంగరావు బంగారం
భుజంగరావు బంగారం
భుజంగరావు బంగారం
Comments
Please login to add a commentAdd a comment