గరివిడిలో చోరీ
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి పట్టణంలోని జగన్నాథ కాలనీలో చోరీ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గరివిడి పట్టణంలోని జగన్నాథ కాలనీలో నివాసం ఉంటున్న బాసిన సతీష్ ఈనెల 2వ తేదీన పనినిమిత్తం బయటకు వెళ్లాడు. ఈ నెల 5న రాత్రి 8గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి ముందర గ్రిల్స్ గేటు విరగ్గొట్టి తలుపులు తెరిచి లోపల ఉన్న బెడ్‌రూంలోకి ప్రవేశించి బీరువా తలుపులు బలవంతంగా తెరిచి అందులో ఉన్న వస్త్రాలను చెల్లాచెదురు చేసినట్లు ఉన్నాయి. బీరువా లాకర్‌లో ఉన్న రెండు బంగారపు ఉంగరాలు(ఒక్కొక్కటి పావుతులం) 5వేల రూపాయలు నగదు దొంగతనానికి గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు సతీష్ తామెవరూ ఇంటిలో లేనప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలో ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ దొంగతనం జరిగిన ప్రాంతంలో కొన్ని ఆధారాలను సేకరించింది.
రెండు ఉంగరాలు, 5వేల నగదు
అపహరణ
Comments
Please login to add a commentAdd a comment