![వైఎస్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/07022025-vzm_tab-02_subgroupimage_1885687344_mr-1738869121-0.jpg.webp?itok=yTcoEWDA)
వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగం జిల్లా అధ్
పార్వతీపురంటౌన్: వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా పాలకొండ నియోజకవర్గానికి చెందిన ఎద్దు లిల్లి పుష్పనాథం నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ కార్యాలయం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
సెల్‌షాపులో చోరీ
బలిజిపేట: మండల కేంద్రం బలిజిపేట ప్రధాన రహదారిలో ఉన్న సప్తగిరి సెల్‌షాపులో సుమారు రూ.85వేల సెల్‌ఫోన్లు, బ్లూటూత్‌లు చోరీకి గురయ్యాయి. షాపుయజమాని శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సింహాచలం ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనాస్థలానికి వచ్చి చోరీ జరిగిన పర్యవేక్షించారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన కొత్తవి 8పెద్ద ఫోన్లు, 5బ్లూ టూత్‌లు పోయినట్లు షాపు యజమాని శ్రీనివాసరావు తెలిపారు. షాపు షట్టర్లకు ఉండే తాళాలు పగలకొట్టి చోరీ చేశారన్నారు. ఉదయం వచ్చి చూసే సమయానికి షట్టరు దిగువకు దించి ఉందని లోపల వస్తువులు పోయినవి లేనివి నిర్ధారణ చేసుకుని ఫిర్యాదు చేసినట్లు వాపోయాడు. దీనిపై ఎస్సై సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
కుక్కలదాడి ఐదుగొర్రెల మృతి
బాడంగి: మండలంలోని పూడివలసలో గురువారం తెల్లవారుజామున జరిగిన కుక్కలదాడిలో గ్రామానికి చెందిన ఇప్పిలిరామస్వామి ఐదు గొర్రెలు మృతిచెందగా మరో 6గొర్రెలు గాయాలపాలై కొనఊపిరితో ఉన్నాయి. ఎప్పుడూ మాదిరిగానే తన గొర్రెలను శాలలో ఉంచగా కుక్కలు దాడిచేసి కరిచిచంపినట్లు బాధితుడు తెలిపాడు. మరో ఆరు గొర్రెల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందన్నారు. గతంలో కూడా రామస్వామి గొర్రెలు కుక్కలదాడిలో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గాయాలైన గొర్రెలకు పశువైద్యాధికారి సతీష్ వైద్యచికిత్స అందజేశారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వృద్ధుడి అదృశ్యం
బాడంగి: మండలంలోని గజరాయునివలసకు చెందిన దాసరి సత్యం(80)అనే వృద్ధుడు రెండురోజులుగా కనిపించడం లేదని స్థానిక పోలీసులకు గురువారం ఫిర్యాదు అందింది. ఆయన కుమారుడు రమణరావు ఇచ్చిన ఫిర్యాదులో బుధవారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లిన వ్యక్తి మరుసటిరోజు వరకు ఇంటికి రాలేదని కావున పోలీసులు వెతికి తమకు అప్పగించాలని కోరినట్లు ఎస్సై ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసినవారు సమాచారమివ్వాలని కోరారు.
విజయనగరంలో మరో వ్యక్తి..
విజయనగరం క్రైమ్: స్థానిక తోటపాలెంలో నివాసం ఉంటున్న పోలిపల్లి ఏసు జనవరి 29 నుంచి కనబడడం లేదని కుటుంబసభ్యులు వన్‌టౌన్ పోలీసులకు గురువారం ఫిర్యాదుచేశారు. ఈ మేరకు వన్‌టౌన్ సీఐ అందించిన వివరాలిలా ఉన్నాయి. తోటపాలెంలో నివాసం ఉంటున్న ఏసు జనవరి 29న రాత్రి 10 గంటల సమయంలో డ్యూటీకి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి ఇప్పటివరకూ ఇంటికి రాలేదని, అన్నిచోట్లా వెతికినా ఆచూకీ లభించలేదని ఆయన భార్య పోలిపల్లి సంతోషి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
![వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగం జిల్లా అధ్1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06bbl24a-370003_mr-1738869121-1.jpg)
వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగం జిల్లా అధ్
![వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగం జిల్లా అధ్2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06vzg174-370045_mr-1738869121-2.jpg)
వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగం జిల్లా అధ్
![వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగం జిల్లా అధ్3](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06ppm101a-370059_mr-1738869121-3.jpg)
వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగం జిల్లా అధ్
Comments
Please login to add a commentAdd a comment