నెల్విడిలో పత్తి పంటలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి
మదనాపురం: పత్తికి సస్యరక్షణ చర్యలు తప్పనిసరని కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నెల్విడి, లక్ష్మీపురం, నర్సింగాపురం గ్రామాల్లోని పత్తి పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యాపిస్తున్న చీడపీడలు, పోషకాల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. పచ్చ దోమ, ఎండు తెగులు అధికంగా ఉందని.. నివారణకు వేప మందు 1,500 పీపీఎం లీటర్ నీటిలో లేదా ఇన్షాట్లోపీస్ మందు లేదా ఎసిటామిపీస్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. వర్షం ఎక్కువగా కురిసినప్పుడు పంటల నుంచి నీరు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎండుతెగులు అధికంగా ఉంటే కార్బండిజం రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్కల మెదళ్లపై పడేలా పిచికారీ చేయాలని తెలిపారు. అనంతరం సస్యరక్షణ మందులను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. సర్పంచ్ రాములమ్మ, పత్తి రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment