![సంత్ సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07wnp11-210089_mr-1738954687-0.jpg.webp?itok=KhNVIiWs)
సంత్ సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం
వనపర్తి: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలల్ మహరాజ్ జయంతిని ఈ నెల 15న జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో జయంతి వేడుకల నిర్వహణపై అధికారులు, గిరిజన నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా వేడుకల నిర్వహణకు ప్రణాళిక రూపొందించాలని, గిరిజన సంఘాల నాయకులు, ఉద్యోగులు బాధ్యత తీసుకొని సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేసేలా చూడాలన్నారు. అధికారులు, గిరిజన సంఘం నాయకులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి పి.సీతారాంనాయక్, గిరిజన సంక్షేమశాఖ అధికారి బీరం సుబ్బారెడ్డి, గిరిజన సంఘం నాయకులు శంకర్‌నాయక్, చంద్రూనాయక్, వాల్యానాయక్, గోవింద్‌నాయక్, రాధాకృష్ణ, ఆంజనేయులు, అర్జున్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment