ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం
పాన్‌గల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక, కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బార్ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.50.60 లక్షల కోట్ల బడ్జెట్‌లో అన్ని సంక్షేమ పథకాలకు కోత విధించిందని.. పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల ధరలు, వారు చెల్లించే పన్నులు పెరిగిపోతున్నాయన్నారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ఈ నెల 10న ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన చలో హైదరాబాద్‌ను ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహా ధర్నాకు జిల్లా నుంచి పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గిరిజన సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బాల్యానాయక్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు భగత్, సీఐటీయూ జిల్లా నాయకులు వెంకటయ్య, నాయకులు జంబులయ్య, డీవైఎఫ్‌ఐ నాయకుడు కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment