ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు రూపొందించిన మిడ్‌వైవ్స్ సేవలు పీహెచ్‌సీ స్థాయిలోనూ పెంచాల్సి ఉంది. ఆ శాఖ వైద్యసిబ్బంది గర్భిణులకు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్‌లో కలిగే లాభాలు, అందుకు చేయాల్సిన వ్యాయామం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. గర్భ నిర్ధారణ అయిన తొలినాళ్ల నుంచే వారు సలహాలు, సూచనలిస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలో ఈ సేవలు కొన్నిచోట్ల మాత్రమే అందుతున్నట్లు సమాచారం.
● జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్‌కు ఇటీవల ఓ గర్భిణి ప్రసవానికి వచ్చింది. ఆ కుటుంబం ఎంత బలవంతం చేసినా వైద్యులు సిజేరియన్ చేయకపోవడంతో డయల్ 100కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులకు వైద్యులు విషయాన్ని వివరించి సాధారణ కాన్పు చేశారు. ప్రభుత్వ ఆస్పతుల్ల్రో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నారనడానికి ఇది ఉదాహరణగా చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment