![నేడు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/08022025-wpd_tab-01_subgroupimage_1880123808_mr-1738954686-0.jpg.webp?itok=GE2px9_H)
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రాజయ్యగౌడ్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ట్రన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో భాగంగా వల్లభ్‌నగర్, బీఎస్‌ఎన్‌ఎల్ వల్లభ్‌నగర్ రోడ్, ఆర్టీసీ డిపో ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా ఉండదని.. వినియోగదారులు సహకరించాలని పేర్కొన్నారు.
ఏఈఓలపై
పనిభారం తగ్గించాలి
కొత్తకోట రూరల్: పనిభారం తగ్గించాలంటూ డివిజన్ పరిధిలోని కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్, అమరచింత ఏఈఓలు శుక్రవారం ఏడీఏ దామోదర్‌కు సమస్యల వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం కాలం చెల్లిన ట్యాబ్‌లు ఇవ్వడంతో వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని సర్వే చేస్తున్నామని.. వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. గ్రామస్థాయిలో వివిధ శాఖల పనులను ఏఈఓలు చేస్తున్నారని.. కాని తమకు అప్పగించిన డిజిటల్ క్రాప్ సర్వేలో ఇతర శాఖల సిబ్బందిని చేర్చకపోవడం బాధాకరమని తెలిపారు. మహిళా ఏఈఓలు ఒంటిరిగా మారుమూల ప్రాంతాలకు భద్రత లేకుండా వెళ్తున్నారని.. సహాయకులను నియమించాలని కోరారు. కార్యక్రమంలో ఏఈఓలు రవీంధర్‌రెడ్డి, నందకిషోర్, స్పందన, అనిత, సూదిరెడ్డి హరిత, స్వాతి పాల్గొన్నారు.
‘స్థానిక’ పోరుకు
సిద్ధం కావాలి : బీజేపీ
వనపర్తి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని.. కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు బి.రాము, మాజీ సర్పంచ్ దేవన్న ఆధ్వర్యంలో రెండోసారి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న నారాయణ సన్మానసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి నుంచే కష్టపడితే స్థానిక సంస్థలతో పాటు వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో వనపర్తి బీజేపీ కై వసం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం నారాయణను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ పెద్దరాజు, నాయకులు తిరుమల్లేశ్, కుమారస్వామి, రామన్‌గౌడ్, చాణక్య అంజి, వసంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07wnp102-210090_mr-1738954686-1.jpg)
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
Comments
Please login to add a commentAdd a comment