![సర్కా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07wnp01r-210089_mr-1738954685-0.jpg.webp?itok=AcS0Z-DZ)
సర్కారు వైద్యంపై భరోసా!
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏటా పెరుగుతున్న ప్రసవాలు
●
వనపర్తి: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులపై పేద, మధ్యతరగతి ప్రజలకు నమ్మకం పెరుగుతుందనడానికి ఏటా ప్రసవాల సంఖ్య పెరగటమే నిదర్శనం. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే.. సిజేరియన్ చేయడంతో డబ్బుతో పాటు ఆరోగ్యం కోల్పోవాల్సి వస్తోందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్‌లో ప్రతి నెల సరాసరిగా 450 ప్రసవాలు నమోదవుతున్నాయి. ఇందులో 60 శాతం సాధారణం కాగా.. అత్యవసరమైతేనేగాని సిజేరియన్ చేస్తున్నారు. మూడేళ్లుగా జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ సెక్టార్లలో నమోదైన ప్రసవాలను పరిశీలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో 60 శాతం సాధారణ, 40 శాతం సిజేరియన్లు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో 30 శాతం సాధారణ.. 70 శాతం సిజేరియన్ కాన్పులు జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కలెక్టర్ ప్రత్యేక చొరవతో..
కలెక్టర్ ఆదర్శ సురభి పలుమార్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ సాధారణ ప్రసవాలు చేయాలని.. అందుకు కావాల్సిన మౌలిక వసతులు, సిబ్బంది కొరతను అధిగమించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా తన సొంత నిధులతో జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏసీలు, గ్లిజర్లు ఏర్పాటు చేయించారు. లక్ష్య కార్యక్రమంలో భాగంగా ఎంసీహెచ్‌లోనూ ఆధునిక లేబర్ గదిని నిర్మించారు.
నవజాత శిశు
మరణాలు తగ్గించేలా..
నవజాత శిశు మరణాలు తగ్గించేందుకు ఈ నెల 4న కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆ శాఖ అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. జిల్లాలో 2024లో నమోదైన నాలుగు శిశు మరణాలకు కారణాలు తెలుసుకొని.. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. పుట్టిన పిల్లల్లో ఉష్ణోగ్రత సమతుల్యత, శ్వాసకోస, నెలలు నిండకముందే జన్మించడంలాంటి సమస్యలు ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. ఎంసీహెచ్‌లో వెంటిలేటర్ సౌకర్యం కల్పించాలని అధికారులు కలెక్టర్‌కు విన్నవించినట్లు సమాచారం.
మౌలిక వసతుల కల్పనతోనే..
కలెక్టర్ ప్రత్యేక చొరవతో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంతో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. 102 వాహనాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి.. గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలి. సిబ్బంది కొరత అధిగమించాల్సి ఉంది.
– డా. శ్రీనివాసులు, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ
కలెక్టర్ చొరవతో పీహెచ్‌సీల్లోనూ..
జిల్లాకేంద్రంలో ఎంసీహెచ్ ఏర్పాటుతో తగ్గిన ప్రైవేటు దోపిడీ
![సర్కారు వైద్యంపై భరోసా! 1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07wnp02-210089_mr-1738954685-1.jpg)
సర్కారు వైద్యంపై భరోసా!
![సర్కారు వైద్యంపై భరోసా! 2](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07wnp03-210089_mr-1738954685-2.jpg)
సర్కారు వైద్యంపై భరోసా!
Comments
Please login to add a commentAdd a comment