![ప్రతిపక్షాలవి పగటి కలలు : జూపల్లి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07wnp602-210094_mr-1738954686-0.jpg.webp?itok=LGjk45vD)
ప్రతిపక్షాలవి పగటి కలలు : జూపల్లి
చిన్నంబావి: కాంగ్రెస్‌పార్టీలో అలజడి సృష్టించడానికి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పావులు కదుపుతున్నాయని రాష్ట్ర ఎక్‌పైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని గూడెం గ్రామ బీటీ రహదారి నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ పగటి కలలు కంటోందని.. అందులో భాగంగానే కాంగ్రెస్‌లో ముసలం అనే టాపిక్‌ను తెరపైకి తెచ్చాయన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా గ్రూపు కడుతున్నారనే మాట అవాస్తవమని.. ఆయన సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంలో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పని చేస్తున్నారని.. వారిని రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తున్నారనే విషయం అర్థం అవడం లేదన్నారు. కార్యక్రమంలో కళ్యాణ్‌రావు, రామచంద్రారెడ్డి, శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment