2018–19లో స్వయం ఉపాధి కొరకు ఎస్సీ సంక్షేమశాఖ ద్వారా మంజూరైన 39 రుణాలతోపాటు గిరిజనులకు సంబంధించి ట్రైకార్ రుణాలు, మైనార్టీ కార్పొరేషన్ నుంచి మంజూరైన రుణాల గ్రౌండింగ్ వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కేంద్ర బీమా పథకాలను ప్రజలకు చేరువ చేయాలని, ముఖ్యమైన పథకాల అమలులో నిర్లక్ష్యం సరికాదన్నారు. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకుల్లో బీమా అమలు చాలా తక్కువగా ఉందని.. సంఖ్య పెంచాలన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ)లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి, స్థిర ఆదాయం వచ్చే కొత్త యూనిట్లను స్థాపించేలా ప్రోత్సహించి వారి జీవన ప్రమాణాలు పెరిగేలా చూడాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఆర్థిక అక్షరాస్యత శిబిరాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, ఇండస్ట్రీస్ ప్రమోషన్ అధికారి నగేష్, బ్యాంకర్లు పాల్గొన్నారు.
మంజూరైన రుణాల గ్రౌండింగ్ చేయాలి..
Comments
Please login to add a commentAdd a comment