జిల్లాలో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు మొత్తం 1,054.. మత్స్యకార సొసైటీలు 143 ఉన్నాయి. ప్రభుత్వం ఈసారి 70 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు కేవలం 70 శాతం మాత్రమే ఆయా గ్రామాల్లోని చెరువులు, రిజర్వాయర్లలో వదిలారు. ఇంకా 30 శాతం మేర పంపిణీ చేయాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూర్, అమరచింత మండలాల్లో ఇంకా పంపిణీ పూర్తి కాలేదు. చేప పిల్లలు ఎప్పుడు వదులుతారు.. అవి ఎప్పుడు పెరిగి పెద్దవి అవుతాయోనన్న సందేహాలను మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment