పాన్‌గల్: అటవీ భూముల్లో నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని డీఎఫ్ఓ తిరుమల్‌రావు తెలిపారు. శుక్రవారం మండలంలోని మాధవరావుపల్లి, గోప్లాపూర్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు వచ్చే ఏడాది నాటే మొక్కలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని.. ప్రతి బీట్ పరిధిలో 25 ఎకరాల్లో మొక్కలు నాటేలా అవసరమైన స్థలాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా క్షేత్రస్థాయి సిబ్బంది హద్దులు ఏర్పాటు చేసుకొని కాపాడాలన్నారు. నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని.. అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎఫ్ఆర్ఓ బాసిరెడ్డి, బీట్ అధికారి బాలమణెమ్మ, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment